బాలీవుడ్ లో బంధుప్రీతి లేదన్న జానీ లీవర్ కుమార్తె

  • సినిమాల్లో నటిస్తున్న జానీ లీవర్ కుమార్తె జేమీ
  • బాలీవుడ్ లో కొందరిపై అతి ఇష్టం ఉండొచ్చని వెల్లడి
  • అది అందరికీ వర్తించదని వివరణ
బాలీవుడ్ లో నెంబర్ వన్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ లీవర్ తెలుగువాడే. ఆయన కుటుంబం ప్రకాశం జిల్లా నుంచి ముంబయి వెళ్లి అక్కడే స్థిరపడింది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా, స్వశక్తితో ఎదిగి బాలీవుడ్ లో తిరుగులేని హాస్యనటుడిగా నేటికీ అలరిస్తున్నారు. ఇప్పుడాయన కుమార్తె జేమీ కూడా సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో బాలీవుడ్ లో బంధుప్రీతి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై జేమీ లీవర్ స్పందించారు.

బాలీవుడ్ లో బంధుప్రీతి కీలకపాత్ర పోషిస్తుందని తాను భావించడంలేదని స్పష్టం చేశారు. కొందరికి కొందరంటే వల్లమాలిన అభిమానం ఉండొచ్చని, దాన్ని బంధుప్రీతిగా భావించలేమని అభిప్రాయపడ్డారు. మిత్రుల పిల్లలపైనా, తెలిసినవాళ్ల పిల్లలపైనా అభిమానం ఉండొచ్చు.. అయితే స్టార్ల పిల్లలందరికీ ఇది వర్తించదు. నేనెప్పుడూ ఓ నటుడి కుమార్తెగా ఫీలవలేదు. బాలీవుడ్ లో అతి ఇష్టం ఉండొచ్చేమో కానీ, బంధుప్రీతి ఉందనుకోను అంటూ వ్యాఖ్యానించారు.

Jamie Lever
Nepotism
Bollywood
Johnny Lever
Sushant Singh Rajput

More Telugu News